Sunday, December 16, 2012

soul mate..


వాన లోన తడుస్తుంటె గొడుగు లాగ తాను మారె...
ఎండ లోన నడుస్తుంటె నీడలాగ తాను మారె
ఫ్రేమలోన నేను ఉంటె తోడు లాగ తాను మారె...
గుండెలోన బాధ ఉంటె బాధ తీర్చె బంధువాయె
ఇది ప్రేమో గీమో ఏమో, నను మార్చేసిందొ మరిపించిందొ మురిపించేసిందో.... 

To be contd.....

Saturday, August 18, 2012

ఎప్పుడూ ఒప్పుకోవద్దురా ఓటమి

         ఎప్పుడూ ఒప్పుకోవద్దురా ఓటమి
       ఎప్పుడూ వదులుకోవద్దురా ఓరిమి
       విశ్రమించవద్దు ఏ క్షణం - విస్మరించవద్దు నిర్ణయం
       అప్పుడే నీ జయం నిశ్చయం రా..
                                       || ఎప్పుడూ ||

       నింగి ఎంత పెద్దదైన రివ్వుమన్న గువ్వపిల్ల రెక్కముందు తక్కువేనురా
       సంద్రమెంత గొప్పదైనా ఈదుతున్న చేపపిల్ల మొప్పముందు చిన్నదేనురా
       (పిడుగువంటి పిడికిలెత్తి ఉరుమువల్లె హుంకరిస్తె దిక్కులన్ని పిక్కటిల్లురా
       ఆశయాల అశ్వమెక్కి అదుపులేని కలలుతొక్కి అవదులన్ని అదిగమించరా
       త్రివిక్రమా పరాక్రమించరా విశాల విశ్వమాక్రమించరా
       జలధిసైతమార్పలేని జ్వాలవోలె ప్రజ్వలించ రా)
       పశ్చిమాన పొంచి ఉండి రవిని మింగు అసురసంధ్య ఒక్కనాడు నెగ్గలేదురా
       గుటకపడని అగ్గిఉండ సాగరాలనీదుకుంటు తూరుపింట తేలుతుంది రా
       నిశా విలాసమెంత సేపురా ఉషోదయాన్ని ఎవ్వడాపురా
       రగులుతున్న గుండెకూడా సూర్యగోళమంటిదేరా
                                  || ఎప్పుడూ ||

       నొప్పి లేని నిముషమేది జననమైనా మరణమైనా
                           జీవితాన అడుగు అడుగునా
       నీరసించి నిలిచిపోతే నిముషమైనా నీది కాదు
                           బ్రతుకు అంటే నిత్య ఘర్షణ
       దేహముంది ప్రాణముంది నెత్తురుంది సత్తువుంది
                           ఇంతకన్న సైన్యముండునా
       ఆశ నీకు అస్త్రమౌను శ్వాస నీకు శస్త్రమౌను
                                 (దీక్షకన్న సారదెవరురా)
                           ఆశయమ్ము సారధౌనురా
       నిరంతరం ప్రయత్నమున్నదా నిరాశకే నిరాశ పుట్టదా
       (నిన్నుమించి శక్తియేది నీకు నువ్వు బాసటై ఇదే)
       ఆయువంటు ఉన్నవరకు చావుకూడ నెగ్గలేక
                            శవము పైన గెలుపు చాటురా
                                   || ఎప్పుడూ ||

Thursday, March 15, 2012

Motherland..!!

దేశ సౌభాగ్యం నలుదిక్కుల వ్యాపించిన వేళ..
ప్రతివ్యక్తి దేశానికొక కొత్త శక్తియై నిలిచిన వేళ.!
నవ వసంతాలు నా దేశాన వికసించిన వేళ ..
తల్లీ..!! నీ పాద చరణాలు నే స్పృశించిన వేళ..!!

హృదయాంతరాలలో నీ ఉన్నతిని నే నింపుకున్నా.
నిశీధి హద్దులు దాటి నీ ప్రశస్తి చేసినా.|
హిమ సమున్నతాన నీ కీర్తిని నే పలుకుతున్న
నా నరనరాన భావోద్వేగం ఉప్పొంగుతున్నా..||

కనుల కన్నీటిలో, సంతోష సాగరాన, దుఃఖ దైన్యం లోన, ఆకలి అలమటింపులలోన,సుఖాల లోగిలిలో ఒలలాడిన వేళ, బాధాతప్త హృదయాన....నా జీవన ప్రయాణ వేళ , నా దేహం ప్రతి అణువులోన..తల్లీ.!! నీ ఉన్నతికై నే శ్రమిస్తూ ఉంటా...
-- ప్రవీన్

though my English translation is poor I did my best :

The moment thou greatness spread-ed all over the world,

The moment thou youths become one of your greatest powers,

The moment all the blissful moment happened in this country,

I bow you thee.. and feel to touch your feet at that very moment..!

Thee always filled my hearts with thou grandeur,

And portrayed thou greatness over blue heavens,

Feeling your greatness on top of the sacred mighty Himalays,

now I am feeling this great pleasure from hearts..!

Even in my tears, in my pleasure, in my hungry, in my happiness and every moment of life, Oh my mother (Bharath Matha) very part of my body is for you and thou progress/greatness..!

Can some one correct me if I am wrong some where.! Thanks every