Thursday, February 27, 2014

మార్పు (The Change)



రాయడం మొదలు పెట్టి చాలారోజులయ్యింది . సరిగ్గా గుర్తు లేదు కానీ ౬ సంవత్సరాల క్రితం అనుకుంటా, ఏదో కథొ కవితో రాయడం మొదలు పెట్టా - తెలుగులో రాయడం ఇది రెండవ కథ. రాసిన మొదటి కథకే "మార్పు" కోరుకోవడం సగటు తెలుగు ప్రేక్షాకునిగా నా అభిరుచి. కానీ దేనీపై రాయాలో అర్థం కాని నేను అదే మార్పు పైనే కథ రాయాలని నిర్ణయించుకున్నా !
జీవితం లో వచ్చే ఒక్కొక్క మార్పు, ఒక్కొక్క కొత్త అనుభవాన్ని, అనుబంధాన్ని , కొత్త ఆశలను చిగురిస్తుందని నా అభిప్రాయం. అదే విషయాన్ని ఈ కథలో చదవండి.

"సమస్యలు అయితే అందరికీ ఉంటాయి కానీ వాటికి సమాధానాలు కొందరి దగ్గరి దగ్గరే ఉంటాయి". కానీ నా సమస్యకో....
-------------------------౦౦--------------------------౦౦------------------------౦౦---------------------------
Town hall దగ్గర్లో ఉన్న park దగ్గర గతం గుర్తు చేసుకుంటూ , వర్తమానం గురించి విచారిస్తూ నడుస్తున్నాడు ప్రసాద్. "నా జీవితంలో ఎన్ని సమస్యలు, ఎన్ని కష్ట సమయాలు.. కానీ అవన్నిటినీ మించింది ఇప్పటి నా సమస్య, అసలు నా జీవితమే సమస్య.."

అసలు ప్రసాద్ గురించి చెప్పాలంటే, అతన్ని అంతగా బాధించే సమస్య గురించి తెలుసుకోవాలంటే ఒక 20
సం..లు వెనక్కు వెళ్లాల్సిందే. అవన్నీ ప్రసాద్ మాటల్లో..

1994 సంవత్సరం, మా పెద్దవాడికి వచ్చిన మలేరియా, ఈ సంవత్సరాన్ని నాకు ఇంతలా గుర్తుంచుకునేలా చేసింది. అప్పుడు వాడికి 7 సంవత్సరాలు. వాడికి విపరీతమైన జ్వరం, అదీ ఆపి ఆపి రావడం, జలుబు, చలి, పొద్దున రాత్రి Doctor దగ్గరికి Injection కోసం భుజాలపై వాణ్ణి ఎత్తుకొని వెళ్ళడం. ఇవన్నీ ఇప్పటికీ గుర్తు. కనీసం ఒక 10 - 12 రోజులు, నేను, నా భార్య నిద్రలేని రాత్రులు గడిపిన గుర్తు. అలా అల్లారుముద్దుగా పెంచిన బిడ్డ ఈ రోజు చాలా మారిపొయాడే అని బాధ.

జీవితంలో ఇది ఒకటే కాదు, ఇంకా ఎన్నో సంఘటనలు. ఎన్నో అనుభావాలు... వాటి వెనక ఉన్న  అనుభూతులు...

1998 సంవత్సరం అనుకుంటా.. అప్పట్లో ఊళ్ళో 7వ తరగతికి మించి ప్రైవేట్ బడులు లేని పరిస్థితి. సర్కారీ బడిలో 10వ తరగతి వరకు ఉన్నా 10 తర్వాత పెద్దగా బాగుపాడిన (నా ఉద్దేశ్యం లో) వాళ్ళ సంఖ్య వేళ్ళ మీద లెక్కపెట్టొచ్చు.

సరిగ్గా అప్పుడే Hyderabad లో ఉంటున్న బావమరిది ఇచ్చిన సలహా. పట్నంలో 6వ తరగతిలో పెద్దవాడిని మంచి schoolలో చేర్చడం. నాకు అస్సలు ఇష్టం లేని పని, పెద్దవాడిని వదిలి ఉండటం. వాడిని వదిలి ఉండకపోవడం నా బలహీనత కానీ, వాడిని ప్రయోజకుణ్ణి చేయడం నా బాధ్యత, వాడి భవిష్యత్తు గురించి బెంగతో అలా చెయ్యాల్సి వచింది. అయినా అంత బాధపడలేదు, ఏదో ఒక రోజు వాడు ప్రయోజకుడు కావాలని నా ఆశ. ఆ మరు సంవత్సరం చిన్నవాడు, రెండేళ్లలో అమ్మాయి ముగ్గురినీ పట్నం లో చదువుల కోసం వదలాల్సి వచ్చింది.

   పిల్లల మీద ప్రేమ ఒకవైపు, వారి భవిష్యత్తు గురించి ఆలోచన, పట్నం లో ఖర్చులు ఇంకో వైపు, ఇవి అప్పటికి నన్ను ఎంతో బాధించిన సమస్యలు. అయినా ఈ రోజు నా పరిస్థితికి ఇవన్నీ పెద్ద సమస్యలుగా అనిపించడం లేదు.

-------------------------౦౦--------------------------౦౦------------------------౦౦---------------------------
ఇవన్నీ ఆలోచిస్తుండగా ప్రసాద్‌ని ఎవరో వెనక నుండి భుజం తట్టగానే, ఈ లోకంలోకి వచ్చి, ముఖంపై లేని చిరునవ్వు తెచ్చుకుంటూ పలకరించాడు. "నమస్తే..!!"
"నమస్కారమండీ.. ఎలా ఉన్నారు ?" అవతలవైపు నుండి సమాధానంతో కలిపి ఒక కుశల ప్రశ్న.
"బాగానే ఉన్నాను, మీరెలా ఉన్నారు?"
"నేను బాగున్నాను, అయిన బాగానే ఉండటానికీ, బాగా ఉండటానికీ చాలా తేడా ఉండండోయ్..అయినా బాగుండక ఎం చేస్తారులెండి, పెద్దబ్బాయికి పెద్ద Company లో ఉద్యోగం, చిన్నోడు Intelligence లో, అమ్మాయి డాక్టర్, మీకేం తక్కువ." చమత్కరింపు.
"నా సమస్య ఈయనకే ఉంటే అసలు నాలా ఉండేవాడు కాదు", అని మనసులో ప్రసాద్ అనుకుంటుండగా, మళ్ళీ అవతల వ్యక్తి.
"గత కొన్ని రోజులుగా ఏదో అడగాలని అనుకుంటున్నాను. మీరు మీ పెద్దబ్బాయి పెళ్లి తర్వాత ఏదో బెంగ పెట్టుకున్నట్టున్నారు. అసలు ఏమిటి సమస్య, నాతో చెప్పాలనుకుంటే చెప్పండి, ఎంతైనా మీ అబ్బాయీ, మా అబ్బాయీ మంచి స్నేహితులు కదా సమస్య ఏదైనా ఉంటే మాట్లాడి పరిష్కరించుకోవచ్చు."
   "అలాంటిదేం లేదండీ.." ప్రసాద్ సమాధానం, అదే artificial నవ్వుతో..
-----------------------------------౦౦౦౦---------------------------------------
మధ్యలో 3 నెలలు పెద్దవాడు Office పనిమీద Europe వెళ్తే ప్రసాద్ తను పెరిగిన ఊరు వెళ్ళి వచ్చాడు.

మళ్ళీ కొన్ని వారాల తర్వాత అదే Town Hall Park లో ఆ రోజు కలిసిన పెద్ద మనిషి కోసం ప్రసాద్ ఎదురుచూస్తూ, మెల్లగా పాత జ్ఞాపకాల్లోకి వెళ్లాడు.

2002 సం. పెద్దవాడికి IIT లో సీట్ కోసం Delhi వెళ్ళాలని Hyderabad వచ్చిన రోజు, వాళ్ళమ్మ వాడికి Delhi లో సీటు రాకూడదని ఒకటి, రెండు సార్లు దేవుణ్ణి మోక్కడం ఇప్పటికీ గుర్తు. ఇదేంటి, అమ్మెంటీ, కొడుక్కి Delhi లోని మంచి కాలేజ్ లో సీటు రాకూడదని కోరుకోవడం అనుకుంటున్నారా..! Delhi లో సీటు రాలేదంటే ఇక్కడే చెన్నై లో వస్తుందని. అప్పట్లో మంచి స్కూల్ కోసమని Hyderabad లో వదలడానికి కారణం కనీసం పిల్లల్ని చూడటానికి వాళ్ళమ్మ ఇంట్లో ఉండొచ్చనే ఆశ, అదీ కాక వాళ్ళమ్మ పిల్లల్ని బాగానే చూసుకుంటుందనే నమ్మకం. కానీ ఇప్పుడో, Delhi లో కొడుకుని చూడాలంటే కనీసం 30 గంటలు రైలు ప్రయాణం, అదీ 3 గంటలు బస్ లో Hyderabad ప్రయాణం తర్వాత కానీ  ఎం చేస్తాం తల్లి మనసు, కొడుకు క్షేమం, మంచి భవిష్యత్తు కోరుకుంటుంది కానీ తన స్వార్థం గురించి .ఆలోచించదు కదా! ప్రసాద్ కొడుకుతో ప్రయాణం కాగానే తిరుపతి వెంకన్న కు మొక్కుకుంది, వాడికి సీట్ వస్తే కొండకి నడిచివస్తానని, 2వారాల్లో మొక్కు తీర్చుకుంది.

అలా చూస్తుండగానే 4 సంవత్సరాలలో పెద్దవాడి చదువు అయి ఉద్యోగం, ఇంకో 2 సంవత్సారాలలో చిన్న వాడి ఉద్యోగం, అమ్మాయి MBBS లో చేరడం చకచకా జరిగిపోయాయి.
"ఇన్ని మార్పులు జరుగుతున్నా జీవితంలో కనీసం విశ్రాంతిలేని సైనికులలాగా పనిచేశారుప్రసాద్ అతని భార్య. గతం మిగిల్చిన జ్ఞాపకాలను నెమరువేస్తుండగా వచ్చాడు ప్రసాద్ ఎదురు చూస్తున్న వ్యక్తి."

మళ్లీ ఆత్మీయంగా పలకరింపు "ఏమోయ్ ప్రసాద్, బాగున్నావా? చాన్నల్ళయింది, కనీసం కనిపించడం లేదు, ఎం మీ వాడితో కలిసి Europe Trip ఏమైనా వెళ్ళావా?" చమత్కరించాడు కేశవ.

అగ్నిపర్వతం లోంచి ఎగిసిపడే లావాలా తన్నుకు వచిన ఆవేదనని ఒక్కసారిగా వెళ్ళగక్కాడు ప్రసాద్. తాను పిల్లల్ని ఎలా పెంచిందీ, చాలా కష్టం అయినా బావమరిది ఇంట్లో ఉంచి చదివించిందీ, పిల్లలకు జ్వరం వచ్చినా, మంచీ చెడు దేనీకైనా ఎలా ఇన్నాళ్లు చేసింది అంతా తన స్నేహితునికి వివరించాడు. ఇవన్నీ గతం, ఇప్పుడు తనకు ఉన్న సమస్యంతా తన కొడుకులో వచ్చిన మార్పు. గత 25 సంవత్సరాలుగా బాగా పని చెయ్యడం అలవాటయిన తనను ఇక్కడ Hyderabad  కి తీసుకొచ్చాడు. ఉదయం 5 గం. లకు నిద్ర లేచి GYMకు వెళ్ళడం మొదలు రాత్రి నిద్ర పోయేంత వరకు తన పనిలో తను Busy. కనీసం ఇంట్లో పలకరించే తీరిక ఉండదు. ఎప్పుడు ఆఫీస్, ఫ్రెండ్స్ ఇంకా అప్పుడప్పుడు సినిమాలు. తన లోకం తనదే. ఏదయినా అడిగితేయ్ Weekend  లో చూద్దాంలే నాన్నా అంటాడు, అలాగానీ ఎం తక్కువ చెయ్యదు. ఎప్పటికప్పుడు Health checkup, ఇంట్లో వ్రతాలు అన్నీజరుగుతాయి, కానీ నేనేమి వాడికి తక్కువ చేశానని వాడిని నన్ను ఇలా అందరు ఉన్న అనాథలా చేశాడు ?
 అప్పుడప్పుడు బావమరిది, ఇంకా చిన్నవాడు సెలవుల్లో వచ్చి వెళతారు. ఏదయినా అనారోగ్యంగా ఉంటే అమ్మాయి పరిగెత్తుకుంటూ వచ్చి, వైద్యం చేస్తుంది. కానీ ఇన్నీ ఉన్నా ఏదో ఒక తీరని లోటు.
కేశవ కి సమస్యంతా అర్థమయ్యింది. కానీ ఇప్పుడు సమస్యకు సమాధానం చెప్పి ఒప్పించేలా లేదని కూడా అర్థం అయ్యింది.
"జీవితం లో వచ్చే ఒక్కొక్క మార్పు, ఒక్కొక్క కొత్త అనుభవాన్ని, అనుబంధాన్ని , కొత్త ఆశలను చిగురిస్తుంది", ప్రస్తుతానికి నేను చెప్పాల్సింది ఇంతే అన్నాడు కేశవ.
నిరాశలో ఉన్న ప్రసాద్, కొన్నాళ్ళు సొంత ఊర్లో ఉంటే మంచిదని చెప్పి వెళ్ళిపోయాడుకేశవ.


సరిగ్గా ఈ సంఘటన జరిగిన 6 నెలల తర్వాత ప్రసాద్ తన సొంత ఊరి నుండి పెద్దవాది దగ్గరికి వచ్చాడు. తన మనవణ్ణి చూసుకోవడానికి ప్రసాద్ వచ్చాడని తెలిసి తానూ పిల్లాడిని చూడాలని ప్రసాద్ ఇంటికి వెళ్లాడు కేశవ.

అప్పుడు ప్రసాద్ ముఖంలో ఆనందం, తన ఇన్ని సంవత్సరాల బాధని కూడా మరిపించేలా ఉంది. కేశవ ప్రసాద్ తో ఇలా చెప్పాడు. "బహుశా నీ సమస్యకు సమాధానం దొరికిందనుకుంటాను."
"ప్రసాద్, జీవితం లో వచ్చే మార్పులు కొత్త అనుబంధాన్ని, ఆశను చిగురిస్తాయి. చూసావా! మనిషికి చిన్న వయసులో అమ్మ వోడి, చదివే వయసులో బడి, ఒక వయస్సుకు రాగానే పెళ్లి, మళ్లీ పిల్లలు, వాళ్ళ ముద్దు ముద్దు మాటలు, మళ్లీ వాళ్ళ బడి, చదువు, పెళ్ళిళ్ళు, అలా మారుతూనే ఉంటుంది. మనమే మార్పుకి చాలా నిదానంగా అలవాటు పడతాం, మార్పుకి తగ్గట్టు ఎంత తొందరగా మారితే అంత మంచిది." చెప్పాడు కేశవ.

ప్రపంచంలో శాశ్వతమైనది ఏదైనా ఉంటే ఆది మార్పు మాత్రమే, మార్పుని ఎంత తొందరగా ఆహ్వానించగలిగితే, దానికి ఎంత తొందరగాఆలవాటు పడితే జీవితం అంత మధురంగా అనిపిస్తుంది."

ఇది జరిగి సరిగ్గా 6 నెలలు తిరగకముందే ప్రసాద్ అదే Town Hall Park లో మనవడిని ఆడించడానికి తీసుకువచ్చాడు. ఇప్పుడు మునుపటిలా లేడు. చాలా సంతోషంగా ఉన్నాడు. ఇంకా సంతోషించే విషయం ఏమిటంటే, తన కొడుకు వాడి కొడుకుని ఆడించడానికి, వాడితో గడపడానికి తొందరగా ఆఫీస్ నుండి వస్తున్నాడు. ఇప్పుడు అర్థం అయ్యింది, నాన్న ప్రేమలోని మాధుర్యం. ఇల్లంతా ఒకటే సందడి, ఇక ఏ సమస్యా లేదు.

మనలో కూడా మార్పుని స్వాగతించక, గతంలో ఇంకా గడుపుతూ, వర్తమానాన్ని ఆస్వాదించని వాళ్ళు చాలా మందే ఉంటారు. కానీ ప్రకృతి ప్రసాదించిన వరాలని ఆస్వాదిస్తూ మార్పుని అలవాటుగా చేసుకున్న ప్రసాదులు ఎప్పటికీ సమస్యలను సమాధానాలతో స్వాగతిస్తారు..!!